బాలాపూర్‌ లడ్డూ @రూ.35 లక్షలు

హైదరాబాద్‌ బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ ఈ సారి కూడా వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది.

By అంజి
Published on : 6 Sept 2025 11:33 AM IST

Hyderabad, Balapur Ganesh laddu price, Balapur Ganesh, RecordPrice

బాలాపూర్‌ లడ్డూ @రూ.35 లక్షలు

హైదరాబాద్‌ బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ ఈ సారి కూడా వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూ.30.01 లక్షలు పలకగా.. ఈ ఏడాది ఏకంగా రూ.35 లక్షలతో రికార్డును బద్దలు కొట్టింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్‌.. లడ్డూనూ దక్కించుకున్నారు. బాలాపూర్‌లో 1994లో తొలిసారి లడ్డూ వేలం వేశారు. రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.లక్షలకు చేరుకుంది. ఈ సారి 38 మంది వేలం పాటలో పాల్గొన్నారు.

బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్‌ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.

Next Story