హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ ఇక లేరు
హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ డిసెంబర్ 26 ఉదయం కన్నుమూశారు.
By - అంజి |
హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ ఇక లేరు
హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ డిసెంబర్ 26 ఉదయం కన్నుమూశారు. "ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా తుది శ్వాస విడిచారు" అని తోటి కళాకారుడు ఒకరు తెలిపారు. ఆమె భర్త ఆమెకు ముందే మరణించాడు.
కళాకారిణి కవితా దేవుస్కర్ జాతీయ చిత్రకారిణిగా పరిణతి చెంది దేశ, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆమె కళాకారుడు సుకుమార్ దేవుస్కర్ కుమార్తె, రామకృష్ణ వామన్ దేవుస్కర్ మనవరాలు. సాలార్‌జంగ్ మ్యూజియం ప్రవేశద్వారం వద్ద సాలార్ జంగ్-III యొక్క పెద్ద చిత్రపటాన్ని ఆమె తాత చిత్రించాడు. ఆమె మృతి పట్ల కళాకారుల సంఘం విచారం వ్యక్తం చేసింది.
కవితా దేవుస్కర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివి, అక్కడే ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించి చాలామంది యువ కళాకారులకు స్ఫూర్తినిచ్చారు. 1970లో కళాభవన్‌లో ప్రారంభమైన ఆమె కళాయాత్ర అనేక దేశాల్లో చిత్రకళా ప్రదర్శనలతో ప్రశంసలందుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీగా, ప్రొఫెసర్‌గా చాలామంది చిత్రకళాభ్యాస విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి అందించారు.
"నా గురువు, సీనియర్, ప్రతిభావంతులైన కళాకారిణి, గొప్ప మార్గదర్శక శక్తి. ఆమె మాకు ఎగ్ టెంపెరా టెక్నిక్ యొక్క క్రమశిక్షణ, అందాన్ని దయ మరియు ఓర్పుతో నేర్పింది. ఆమె కళ, బోధనలు ఆమె విద్యార్థుల ద్వారా కొనసాగుతాయి" అని కళాకారుడు లక్ష్మణ్ ఏలే అన్నారు.