హైదరాబాద్ లో ఎట్టకేలకు 1.5 కిలోమీటర్ల పొడవైన అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం కాబోతోంది. చాలా రోజులుగా ప్రారంభోత్సవం ఆలస్యం అవుతూ వచ్చింది. ఫ్లైఓవర్‌ను త్వరలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. మిగిలిన చిన్నచిన్న పనులను వేగంగా పూర్తీ చేయాలని జీహెచ్ఎంసీ చూస్తోంది. 2025 ఏడాది ప్రారంభంలో ఫ్లై ఓవర్ ప్రజల కోసం తెరచుకోనుంది.
నాలుగు లేన్ల ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని, వరంగల్ హైవే నుంచి నగరంలోకి వచ్చే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ఫ్లైఓవర్ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేయగా అందులో భూసేకరణకు రూ.300 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. ఈ ఫ్లై ఓవర్ గోల్నాక దగ్గర ప్రారంభమై MCH క్వార్టర్స్ సమీపంలోని పూర్ణోదయ కాలనీ వద్ద ముగుస్తుంది. అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ను 2023 లోగా పూర్తీ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తీ అవ్వలేదు.