Hyderabad: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో శనివారం నాడు మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

By -  అంజి
Published on : 7 Feb 2026 12:12 PM IST

Hyderabad, Nampally, fire broke out, forensic science laboratory

Hyderabad: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో శనివారం నాడు మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్ హిల్స్‌లోని తెలంగాణలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక పోలీసులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిస్తున్నారు. ఈ ప్రయోగశాల నాంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంది.

Next Story