Hyderabad: కదులుతున్న కారు టాప్‌పై జంట రొమాన్స్.. సంచలనం రేపుతోన్న వీడియో
హైదరాబాద్‌లో కదులుతున్న కారు రూఫ్ టాప్‌లో నిలబడి ఓ యువ జంట రొమాన్స్ చేసుకుంటున్న వీడియోపై సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తోంది.
By అంజి Published on 15 Oct 2023 12:10 PM ISTHyderabad: కదులుతున్న కారు టాప్‌పై జంట రొమాన్స్.. సంచలనం రేపుతోన్న వీడియో
హైదరాబాద్‌లో కదులుతున్న కారు రూఫ్ టాప్‌లో నిలబడి ఓ యువ జంట రొమాన్స్ చేసుకుంటున్న వీడియోపై సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తోంది. ధరణి అనే వినియోగదారు X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలకు దారితీసింది. కొందరు ఈ జంటపై విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు ఈరోజుల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయని అంటున్నారు. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్యాగ్ చేసినా , వారు దీనిపై ఇంకా స్పందించలేదు.
హైదరాబాద్‌లో బహిరంగంగా ఇలా తమ ఆప్యాయతను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇలాంటి ఘటనల కారణంగా హైదరాబాద్‌లోని పౌర సంస్థ అవివాహిత జంటలను ఇందిరా పార్క్‌లోకి ప్రవేశించకుండా పరిమితం చేసింది, దీని ఫలితంగా ఆ సమయంలో ప్రజల ఆగ్రహానికి దారితీసింది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌లలో రొమాన్స్ చేసుకుంటూ జంటలు పట్టుబడ్డారు. లిఫ్ట్‌లలోని కెమెరాల గురించి వారికి తెలియకపోయినా, వీడియోలు ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి వీడియోలు బయటపడ్డాయి. ఇటీవల, మెట్రో కోచ్ నేలపై కూర్చున్న యువ జంట ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ప్రయాణికులకు “అలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండమని” విజ్ఞప్తి చేసింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు, కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు హాస్యం ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్‌లో కారు పైకప్పుపై ముద్దులు పెట్టుకున్న జంట వీడియో ఎప్పుడు తీశారో అస్పష్టంగా ఉంది, వైరల్ వీడియో ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.