Hyderabad: కారు ఢీకొని బాలుడు మృతి.. పోలీసుల అదుపులో రిటైర్డ్‌ ఐపీఎస్‌

హైదరాబాద్: నేరేడ్‌మెట్‌లోని రామకృష్ణాపురం వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

By అంజి  Published on  14 Aug 2024 4:13 AM GMT
Hyderabad, Retired IPS officer, speeding car, student Death

Hyderabad: కారు ఢీకొని బాలుడు మృతి.. పోలీసుల అదుపులో రిటైర్డ్‌ ఐపీఎస్‌

హైదరాబాద్: నేరేడ్‌మెట్‌లోని రామకృష్ణాపురం వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఎం. శ్రీకాంత్‌గా గుర్తించబడిన అతను పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన అమ్ములుకు శ్రీకాంత్ ఒక్కడే సంతానం. తల్లీకొడుకులు నేరేడ్‌మెట్‌ అనంతయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు.

నేరేడ్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్‌ రోడ్డు పక్కనే ఆగిపోయాడు. డి. విజయ్ కుమార్ అనే 84 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తన కారును అతివేగంగా నడిపి యువకుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం భర్త సుబ్బయ్య చెట్టుపై నుంచి పడి మృతి చెందడంతో శ్రీకాంత్‌ను అమ్ములు ఒంటరిగా ఉంటూ పెంచుకుంటోంది. సుబ్బయ్య మరణంతో అమ్ములు తమ కుమారుడి బాధ్యతను భుజానకెత్తుకున్నారు.

శ్రీకాంత్ మరణ వార్త తెలియగానే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో బాధతో అమ్ములు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాలుడికి న్యాయం చేయాలంటూ బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ మహేశ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story