Hyderabad: పబ్‌లో అశ్లీల నృత్యాలు.. 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మంది అరెస్ట్
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ పబ్‌పై దాడి చేసి 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 11 Sep 2023 2:15 AM GMTHyderabad: పబ్‌లో అశ్లీల నృత్యాలు.. 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మంది అరెస్ట్
హైదరాబాద్: కమీషనర్ టాస్క్ ఫోర్స్ (వెస్ట్ జోన్) ఆదివారం ఎస్‌ఆర్ నగర్‌లోని హంటర్ రెస్ట్రో బార్ అండ్ పబ్‌పై దాడి చేసి 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పబ్ నిర్వహణకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి సరైన లైసెన్సులు లేవని, మద్యం ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇంకా కస్టమర్లను పబ్‌కు ఆకర్షించడానికి పబ్ నిర్వాహకులు 10 మంది మహిళా డ్యాన్సర్‌లను ఏర్పాటు చేశారు. పబ్బులో అశ్లీల నృత్యాలతో పాటు అనధికారకంగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా నిర్వాహకులు పబ్ నిర్వహిస్తున్నారు. పబ్‌లో అశ్లీల డ్యాన్స్‌లు చేస్తున్న మహిళలను పోలీసులు పట్టుకున్నారు.
కస్టమర్లను ఆకర్షించేందుకు మహిళల చేత పబ్ మేనేజ్మెంట్ అర్థనగ్న డ్యాన్స్‌లు చేయిస్తోందని పోలీసులు తెలిపారు. "పబ్‌లో డ్యాన్సర్లు అశ్లీలమైన, అసభ్యకర చర్యలకు పాల్పడ్డారు. మగ కస్టమర్‌లను చూసి సైగలు చేయడం, డబ్బు కోసం అనైతిక చర్యలకు వారిని వాడుకోవడానికి పబ్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు" అని డిసిపి టాస్క్ ఫోర్స్ పి రాధా కిషన్ రావు అన్నారు. పబ్ మేనేజ్‌మెంట్ అనుమతించదగిన డెసిబుల్స్‌కు మించి పబ్‌లో డీజేని నడుపుతోంది. ఇది స్థానిక నివాసితులకు అసౌకర్యాన్ని సృష్టిస్తోందని అధికారి తెలిపారు. పట్టుబడిన వ్యక్తులు పబ్ యజమాని హెచ్ కృష్ణారావు (38), ఈవెంట్ ఆర్గనైజర్ ఒమర్ బిన్ అబ్దుల్లా (43), పబ్‌లోని క్యాషియర్ బి సిద్దార్థ (36), డిజె కె కృష్ణ (25) ఉన్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని ఎస్‌హెచ్‌ఓ ఎస్‌ఆర్ నగర్‌కు అప్పగించారు.