Hyderabad: ఆడపిల్ల పుడుతుందని.. గర్భిణీని పుట్టింటికి పంపిన భర్త

తనకు జన్మనిచ్చింది ఓ మహిళ... తను పెళ్లి చేసుకుంది కూడా ఓ మహిళనే.. కానీ తనకు ఆడపిల్ల పుడుతుందని గర్భిణీ అయిన తన భార్యను గెంటేసాడు ఓ మూర్ఖుడు.

By అంజి  Published on  29 Jan 2025 9:15 AM IST
husband , pregnant woman, Hyderabad

Hyderabad: ఆడపిల్ల పుడుతుందని.. గర్భిణీని పుట్టింటికి పంపిన భర్త 

హైదరాబాద్‌: తనకు జన్మనిచ్చింది ఓ మహిళ... తను పెళ్లి చేసుకుంది కూడా ఓ మహిళనే.. కానీ తనకు ఆడపిల్ల పుడుతుందని గర్భిణీ అయిన తన భార్యను గెంటేసాడు ఓ మూర్ఖుడు. కనికరం లేకుండా అర్ధరాత్రి గర్బవతి అయిన భార్యను, తన ఇద్దరు పిల్లలను పుట్టింటికి పంపించాడు ఓ ప్రబుద్దుడు. వివాహ సమయంలో పెట్టిన సామాన్లు సైతం అత్త ఇంటికి పంపించాడు. తన ఇద్దరి పిల్లతో రోడ్డు పాలైన నిండు గర్భిణీ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో భర్త మీద ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హుమేరా బేగం అనే మహిళకు అక్బర్ ఖాన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే అత్తమామలకు తన భర్త వత్తాసు పలుకుతూ ప్రతినిత్యం వేధింపు లకు గురి చేస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం జరిగి నప్పటి నుండి భర్త వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు వాపోయింది. మొదటి సారి ఆడపిల్లకు జన్మ నిచ్చిన తరువాత అదనపు కట్నం తేవాలని చిత్ర హింసలకు గురిచేసి తన తల్లి దండ్రుల వద్దకు పంపించి వేశాడని, అలాగే గర్భవతి అయిన‌ రెండు సార్లు పుట్టింటికి వెళ్లగొట్టాడని తెలిపింది.

ఇప్పుడు మూడోసారి గర్భవతిని చూడకుండా తనను, తన పిల్లల్ని పుట్టింటికి పంపించి పెళ్లి సమయంలో పెట్టిన సామాన్లు కూడా తీసుకువచ్చి తన తల్లిదండ్రుల ఇంటి వద్ద పడేసాడని... అదనపు కట్నం ఇస్తేనే ఇంట్లోకి అనుమతి ఉందంటూ కరాకండిగా చెప్పాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.. పోలీసులు తన భర్త అక్బర్ ఖాన్ పై చర్యలు తీసుకో వాలని బాధితురాలు డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story