భారీగా గంజాయి పట్టివేత

Huge amount of Ganja seized in Hyderabad police.భాగ్య‌న‌గ‌రంలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయిని ర‌వాణా చేస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 8:15 AM GMT
భారీగా గంజాయి పట్టివేత

భాగ్య‌న‌గ‌రంలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయిని ర‌వాణా చేస్తున్న అంత‌ర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరి వ‌ద్ద నుంచి 1,820 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ‌హిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.3కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖ సీలేరు నుంచి మ‌హారాష్ట్ర‌కు లారీలో గంజాయి త‌ర‌లిస్తున్నారు. రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ నిర్వ‌హిస్తున్న త‌నిఖీలో ఈ గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు దాన్ని త‌ర‌లిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల‌కు వెల్ల‌డించ‌నున్నారు.

Next Story