Hyderabad: ఫార్చ్యూన్ హోటల్ యజమాని పైల్వాన్ అఖిలేష్ ఎలా యువతులను వ్యభిచారంలోకి దింపాడంటే?

ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ భారీ వ్యభిచార రాకెట్ కు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jan 2024 10:34 AM IST
Pailwan Akhilesh, Fortune Hotel, Hyderabad

Hyderabad: ఫార్చ్యూన్ హోటల్ యజమాని పైల్వాన్ అఖిలేష్ ఎలా యువతులను వ్యభిచారంలోకి దింపాడంటే?

ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ భారీ వ్యభిచార రాకెట్ కు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పలువురు యువతులను వ్యభిచారకూపం నుండి బయటపడేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది బాధితులు రాంనగర్ అఖిల్ పైల్వాన్ అకా సాలువాసి అఖిలేష్ ద్వారా ఈ వ్యాపారంలోకి నెట్టివేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కె సంజన (పేరు మార్చబడింది)కు ఉద్యోగం, మంచి కెరీర్ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం పేరుతో మోసం చేసి.. తనను వ్యభిచారకూపంలోకి నెట్టివేస్తారని ఆమె అసలు ఊహించలేదు.

అబిడ్స్‌లోని బిగ్ బజార్ లేన్‌లో ఉన్న ఫార్చ్యూన్ హోటల్ యజమాని అయిన 34 ఏళ్ల అఖిలేష్ వ్యభిచార రాకెట్‌లో కింగ్‌పిన్‌గా ఉన్నాడు. అఖిల్ పైల్వాన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, బీజేపీ కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌తో కూడా ఫోటోలకు పోజులిచ్చాడు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అతడి రాకెట్ వ్యవహారం తెలియగానే పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 370, 370A IPC, 3,4,5 PIT యాక్ట్ కింద కేసు బుక్ చేశారు.

కేసు వివరాలు:

ఫార్చ్యూన్ హోటల్ యజమాని అఖిలేష్ పైల్వాన్ తన సహచరులతో కలిసి తన హోటల్ ఆవరణలో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు జనవరి 18న అబిడ్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె నరసింహకు సమాచారం అందింది. వెంటనే ఆ హోటల్ పై దాడి చేసి.. నిందితులను అరెస్టు చేశారు. పలు మెటీరియల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నరసింహ ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుళ్లతో కలిసి ఫార్చ్యూన్‌ హోటల్‌కి వెళ్లాడు. రాత్రి 7:45 గంటలకు, పోలీసులు ఫార్చ్యూన్ హోటల్‌పై దాడి చేసి రిసెప్షన్‌లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

''హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో నివాసముంటున్న సాలువాడి అఖిలేష్‌ అనే వ్యక్తిని మేము ప్రశ్నించాము. విచారణలో, అఖిలేష్ ఫార్చ్యూన్ హోటల్ యజమాని అని అతని సహచరుడు పక్కాల రఘుపతి సహాయంతో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు వెల్లడించాడు, ”అని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎన్ సుధాకర్ తెలిపారు.

అఖిలేష్ ఈ వ్యాపారం కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన పీకే, ప్రబాత్ మజుందర్, సిమానీ, రాజు భాయ్, దీపక్ అర్జున్ ద్వారా మహిళా సెక్స్ వర్కర్లను సేకరించినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. “రిసెప్షనిస్ట్/సబ్ బ్రోతల్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న పక్కాల రఘుపతిని మేము ప్రశ్నించాము. సెల్‌ఫోన్‌లో పలు వ్యక్తులను సంప్రదించి మహిళా సెక్స్ వర్కర్లతో పాటు కస్టమర్లను కూడా సంపాదించేవాడు. ఒక గంటకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవాడు'' అని తెలిపారు.

పోలీసుల రైడ్ లో 12 మంది సెక్స్ వర్కర్లను గుర్తించారు. హసీనా జమాదార్, లక్ష్మీ రాయ్, కీర్తి అకా షాలు, సకీనా సమద్ సయ్యద్, అపర్ణా మజుందార్, రిమ్ బిస్వాస్, మోమిన్ షబ్నం, మరియం బీబీ, పూజ శర్మ అరీనా రాయ్, పియా షేక్, అషు రాజ్‌కుమార్ ఠాకూర్ లను పోలీసులు కాపాడారు. సెక్స్ వర్కర్లకు ఆ హోటల్‌లో వసతి కల్పించారని వెల్లడించారు. హోటల్ నిర్వాహకులు కస్టమర్లను ఏర్పాటు చేసి వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని కూడా పోలీసులతో చెప్పారు.

సెక్స్ వర్కర్లందరినీ రక్షించి అదుపులోకి తీసుకున్నారు. సాలువాడి అఖిలేష్, పక్కాల రఘుపతి, అభిషేక్ భాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలేద్, సి సంతోష్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, 13 కండోమ్ ప్యాకెట్లు, ఐదు గెస్ట్ రిజిస్ట్రేషన్ కార్డ్ బుక్‌లు, రెండు కస్టమర్ రిజిస్టర్ బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story