అనాథాశ్రమానికి సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ను విరాళంగా ఇచ్చిన దర్శ్ తిబ్రేవాలా
How Darsh Tibrewala's solar initiative helped Hyderabad orphanage.ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2023 6:25 AM GMTహైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న దర్శ్ తిబ్రేవాలా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనాథ శరణాలయాలకు ఎంతో తోడ్పాటును ఇస్తున్నారు. పలువురిని ఆదుకోడానికి ‘ప్రాజెక్ట్ హోప్స్’ ను ప్రారంభించాడు. నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
నిధులు సేకరించి, రాజేంద్రనగర్‌లోని అనాథాశ్రమానికి సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ను విరాళంగా ఇచ్చాడు. పిల్లలకు కావాల్సిన కరెంట్ ను అందించాడు. అంతేకాకుండా పునరుత్పాదక శక్తి పర్యావరణానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది. పిల్లలకు సురక్షితమైన మరియు మరింత విశ్వసనీయమైన విద్యుత్ వనరును సృష్టిస్తుంది. 10KWp గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్ ధర 7.75 లక్షల రూపాయలు. సౌర ఫలకాలను టాటా పవర్ నుండి సేకరించారు. కెహన్‌శ్రీ సోలార్ ద్వారా ఇన్‌స్టాల్ చేశారు. సోలార్ ప్యానెల్‌ను అమర్చడానికి ముందు ప్రారంభ విద్యుత్ వినియోగం నెలకు 1,800 యూనిట్లు.. విద్యుత్ బిల్లు నెలకు 15,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు వినియోగిస్తున్న యూనిట్ల సంఖ్య 500కు తగ్గింది. బిల్లు నెలకు 4,500 రూపాయలు వస్తోంది. అంటే దాదాపు 66% తగ్గింపు ఉంది.
అనాథాశ్రమంలో గత వారం ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇది లైట్లు, ఉపకరణాలు, ఇతర అవసరమైన పరికరాలకు శక్తినిస్తుంది, సాంప్రదాయ విద్యుత్ వనరులపై అనాధ శరణాలయం ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. పిల్లలకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో అనాథ ఆశ్రమానికి ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఆదా అవుతుంది. 20 సంవత్సరాలకు పైగా ఈ పొదుపు ఉంటుంది.
“ఇది ద్రవ్య కోణంలో మాత్రమే కాకుండా మన భవిష్యత్తు, మన జీవితాలు వంటి వాటికి సహాయంగా ఉంటుంది. సూర్యుడు ఒక ఉచిత, స్థిరమైన, స్వచ్ఛమైన వనరు, మన జీవితాలను శక్తివంతం చేయడానికి సంప్రదాయ విద్యుత్ స్థానంలో సోలార్ ఎనర్జీని ఉపయోగించవచ్చు. నేను అనాథాశ్రమాన్ని చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఆలోచన వచ్చింది, అక్కడ విద్యార్థులు నేర్చుకోవడానికి ఎంత ఆసక్తిగా, ఉత్సాహంగా ఉంటారో తెలుసుకున్నాను. మనకు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడం మనుషుల బాధ్యత అని నేను ఎప్పుడూ నమ్ముతాను. అనాథాశ్రమం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు, నేను వారికి సహాయం చేయాలని నాకు తెలుసు” అని దర్శ్ అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా, అతను హైదరాబాద్‌లోని అనేక అనాథ శరణాలయాలను సందర్శిస్తున్నాడు. వారికి పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అనేక ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్పిస్తున్నాడు. దర్శ్ అనాథాశ్రమానికి సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ను విరాళంగా ఇవ్వడం ప్రపంచంలో నిజమైన మార్పును తీసుకురావడం సాధ్యమని చూపించింది. ఈ చొరవ దర్శ్ సహచరులకు, అనాథ విద్యార్థులకు సమాజ సేవ యొక్క ప్రాముఖ్యతను బోధించడంలో సహాయపడుతుంది.