గ్రేటర్‌ కౌంటింగ్‌.. హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్ ‌దాఖలు

House Motion In TS High Court .. మరి కొద్దిసేపట్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్‌ ప్రారంభం

By సుభాష్  Published on  4 Dec 2020 2:27 AM GMT
గ్రేటర్‌ కౌంటింగ్‌.. హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్ ‌దాఖలు

మరి కొద్దిసేపట్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెన్నుతో టిక్‌ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్య్కులర్‌ జారీ చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లో దీనిపై వాదనలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఎన్నికల కమిషన్‌పై మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ చీటింగ్‌ చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ శాతాన్ని అధికారులు ప్రకటించలేదు. అర్ధరాత్రి సమయంలో సర్క్యులర్‌ జారీ చేయడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. పోలింగ్‌ రోజు అర్ధరాత్రి వరకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కోర్టు ద్వారా కౌంటింగ్‌ను ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కాగా, ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు 30 కౌంటింగ్‌ కేంద్రాల్లో 166 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్‌ హాల్‌ ఉంటుంది. 16 డివిజన్లకు రెండు కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కిస్తారు. తొలి రౌండ్‌లోనే 136 డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడో రౌండ్‌ తర్వాత 13 డివిజన్ల ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది.

Next Story