హైదరాబాద్‌లో హెలికాప్టర్ రైడ్‌.. 1000 అడుగుల ఎత్తు నుంచి న‌గ‌రాన్ని చూడొచ్చు

వెయ్యి అడుగుల ఎత్తు నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర అందాల‌ను వీక్షించొచ్చు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2023 3:09 PM IST
Helicopter, Hyderabad

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


హైద‌రాబాద్ న‌గ‌రంలో చూసేందుకు ఎన్నో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఉన్నాయి. వీకెండ్‌ వ‌చ్చిందంటే చాలు చాలా మంది త‌మ కుటుంబంతో క‌లిసి చారిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌తో పాటు పార్కులు, టెంపుల్స్‌కు వెలుతుంటారు. కాగా.. ఇప్పుడు న‌గ‌రవాసులు ఓ స‌రికొత్త అనుభూతి పొందొచ్చు. న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను హెలికాఫ్ట‌ర్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు.

ఫ్లై హైద‌రాబాద్ పేరుతో ఈ కొత్త స‌ర్వీసులు అందుబాటులోకి వ‌చ్చాయి. మార్చి 8 నుంచి 13 వ‌ర‌కు మాత్ర‌మే ఈ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. 10 నిమిషాల పాటు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి న‌గ‌రాన్ని వీక్షించొచ్చు. బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం మరియు ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి ప్రాంతాల‌ను క‌వ‌ర్ చేయొచ్చు.


ప్ర‌తి రోజు ఉద‌యం 11 నుంచి సాయంత్రం 4 గంటల వ‌ర‌కు హైలికాప్ట‌ర్ రైడ్ అందుబాటులో ఉంటుంది. నెక్లెస్ రోడ్‌లో జలవిహార్ వాటర్ పార్క్ వ‌ద్ద దీనిని ఏర్పాటు చేశారు. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.6,500గా నిర్ణ‌యించారు. BookMyShow ప్లాట్‌ఫారమ్‌లో టికెట్ల‌ను బుక్ చేసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం 9797798999, 8328572041నెంబ‌ర్లను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Next Story