హైదారాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరనం చల్లబడి కుండపోతగా వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్ శేరిలింగంపల్లి, మియాపూర్, హెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
"రాబోయే మూడు నుండి నాలుగు గంటల్లో నగరంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది" అని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న తెలిపారు. ట్విట్టర్‌లో వ్యక్తిగత ప్రైవేట్ వాతావరణ పరిశీలకులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.'మేడ్చల్,హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. ముందుగా కాప్రా, దమ్మాయిగూడ, అల్వాల్, నాగారంలో వర్షాలు మొదలవుతాయి. తరువాత ఒక గంటలో నగరంలోని ఇతర ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి.'' అని తెలిపారు. మరో ఒకటి రెండు గంటల్లో హైదరాబాద్ మొత్తానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని మరో ప్రైవేట్ పరిశీలకుడు ప్రకటించారు. హైదరాబాద్ వ్యాప్తంగా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.