భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

Heavy Rain in hyderabad on September 2nd.భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. సుమారు మూడు గంట‌ల పాటు ఎడ‌తెరిపి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 3:08 AM GMT
భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. సుమారు మూడు గంట‌ల పాటు ఎడ‌తెరిపి లేకుండా కురిసిన వ‌ర్షానికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కాగా.. రోడ్ల‌పైకి భారీగా వ‌ర‌ద నీరు చేరింది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగిప‌డి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన బ‌ల్దియా, ట్రాఫిక్ పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కూక‌ట్‌ప‌ల్లి, బంజారాహిల్స్‌, షేక్‌పేట‌, నాంప‌ల్లి, ల‌క్డీకాపూల్ ప్రాంతాల్లో విరిగిప‌డ్డ చెట్ల‌ను సిబ్బంది తొల‌గించారు.

కృష్ణానగర్ బీ బ్లాక్‌లో వరద నీరు ముత్తెందింది. ఓ యువకుడు అందులో కొట్టుకుపోతుండడంతో స్థానికులు కాపాడారు. నీటి ఉధృతికి మరో వ్యక్తి కొట్టుకుపోతుండటంతో అక్కడే ఉన్న స్థానికులు రక్షించారు. 19 జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల సాయంతో తొలగించాయి. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అత్యధికంగా షేక్ పేట్‌లో 9.8 సెంటీమీటర్లు వ‌ర్ష‌పాతం నమోదు కాగా కూకట్‌పల్లిలో 9.6 సెం.మీ, శేరిలింగంపల్లిలో 8.8 సెం.మీ, సరూర్ నగర్‌లో 8.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 7.6 సెం.మీ, ముసాపేటలో 9.6 సెం.మీ, మాదాపూర్‌ 8.7 సెం.మీ, యూసుఫ్‌గూడ 7.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Next Story