హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు

Heavy rain in hyderabad lowland areas flooded. కొద్ది రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల ధాటికి నగరంలోని డ్రైనీజీ కాలువలు

By అంజి  Published on  29 July 2022 4:15 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు

కొద్ది రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల ధాటికి నగరంలోని డ్రైనీజీ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. భారీ వర్షం పడుతుండటంతో రోడ్ల మీద ఎక్కడికక్కడా వాహనాలు ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భరత్‌నగర్‌, మూసాపేట, ఎర్రగడ్డ, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, హయత్ నగర్, ఎల్ బీ నగర్, అంబర్ పేట, ఓయూ, నాచారా, నల్లకుంట, వనస్థలిపురం, సికింద్రాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, కూకపట్ పల్లి, యూసఫ్ గూడ, మియాపూర్, హెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, గాజుల రామారం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వర్షం నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షంతో నాలాలు ద్వారా వరద నీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతోంది. మరోవైపు మరో రెండు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిచింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.





Next Story