మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు.. బ‌య‌టికి రావొద్దు : జీహెచ్ఎంసీ

Heavy Rain alert in hyderabad today afternoon.హైద‌రాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షం కురవ‌డంతో ప‌లు కాల‌నీలలో నీళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2021 7:31 AM GMT
మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు.. బ‌య‌టికి రావొద్దు : జీహెచ్ఎంసీ

భాగ్య‌న‌గ‌రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వ‌ర్షం నుంచి ఇంకా తేరుకోకముందే మ‌రో భారీ వ‌ర్ష సూచ‌న క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈరోజు(శ‌నివారం) మ‌ధ్యాహ్నం నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. దీంతో జీహెచ్ఎంసీ అప్ర‌మ‌త్త‌మైంది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌రం అయితేనే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబ‌రు 040-21111111 సంప్ర‌దించాల‌ని సూచించారు.

నిన్న భాగ్య‌న‌గ‌రాన్ని భారీ వ‌ర్షం చిగురుటాకులా వ‌ణికించింది. భారీ వ‌ర్షానికి ర‌హ‌దాల‌న్నీ వాగుల‌ను త‌ల‌పించాయి. లింగోజీగూడ‌లో అత్య‌ధికంగా 10.6సెంటీమీట‌ర్లు, క‌ర్మ‌గూడ‌లో 10, హ‌స్తినాపురంలో 8.8, మ‌ల‌క్‌పేట‌లో 8.7, స‌రూర్‌న‌గ‌ర్‌లో 8.6, కంచ‌న్‌బాగ్‌లో 8.4, బ‌హ‌దూర్‌పూరాలో 8.1, రెయిన్ బ‌జార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9, రాజేంద్ర‌న‌గ‌ర్ శివ‌రాంప‌ల్లిలో 6.6 సెంటీమీట‌ర్లుగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

ఇక రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. తూర్పు మ‌ధ్య అరేబియా స‌ముద్రం నుంచి రాయ‌ల‌సీమ‌, ఏపీ తీరం మీదుగా ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం వ‌ర‌కు ఉన్న ఉప‌రిత‌లం ఆవ‌ర్త‌నం బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు తెలిపింది. ఈ నెల 10న ఉత్త‌ర అండ‌మాన్ స‌ముద్రంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

Next Story