Hyderabad: బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం

హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఆర్‌జిఐ) విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది.

By అంజి  Published on  21 Oct 2024 6:57 AM IST
Haryana Governor, Bandaru Dattatreya, accident, Rajiv Gandhi International Airport, Shamsbad

Hyderabad: బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం

హైదరాబాద్‌: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఆర్‌జిఐ) విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. గవర్నర్ నగరం నుండి హర్యానాకు బయలుదేరిన తరువాత కాన్వాయ్ విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దత్తాత్రేయ కాన్వాయ్ విమానాశ్రయం సమీపంలో వేగంగా వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది.

కాన్వాయ్‌లోని మరో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ప్రమాదం పెద్దగా జరగలేదు. దత్తాత్రేయ క్షేమంగా ఉన్నాడు. కాన్వాయ్‌లో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దత్తాత్రేయ కారు సురక్షితంగా ముందుకు పోయేలా చర్యలు తీసుకున్నారు. అయితే, కొంతమంది భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరికీ ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story