Hyderabad: హలీమ్ తయారీకి సిద్ధమవుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న వేళ.. హైదరాబాద్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఒకటైన హలీమ్‌తో వేడుక జరుపుకునేందుకు

By అంజి  Published on  16 March 2023 12:38 PM GMT
Haleem, ramzan, hyderabad

హలీమ్ తయారీకి సిద్ధమవుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న వేళ.. హైదరాబాద్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఒకటైన హలీమ్‌తో వేడుక జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రుచికరమైన వంటకాన్ని మాంసం, కాయధాన్యాలు, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. నగరంలోని హోటళ్లు, తాత్కాలిక హెటళ్లలో నెల పొడవునా హలీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే నగరంలోని దాదాపు అందరు హలీమ్ తయారీదారులు తమ 'హలీమ్ భట్టి'ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. హలీమ్ వండడానికి ప్రత్యేకంగా రూపొందించే సెటప్‌నే హలీమ్‌ భట్టి అంటారు. ఈ వంటకం కేవలం వ్యాపారానికి మాత్రమే కాకుండా నగరంలోని చాలా మంది నివాసితులకు ఉపాధికి కూడా మూలం.

హైదరాబాద్‌లో ఈ రంజాన్‌లో హలీమ్‌కు భారీ ఖర్చు

నెయ్యి, గోధుమలు, మటన్, సుగంధ ద్రవ్యాల ధరల పెరుగుదల కారణంగా ఈ రంజాన్‌లో హలీమ్ ధర గణనీయంగా పెరుగుతుంది. అంచనా వ్యయం పెరిగినప్పటికీ, పవిత్ర మాసంలో మొదటి పక్షం రోజులు, చివరి ఐదు రోజులలో హోటళ్లు ప్రోత్సాహకరమైన వ్యాపారాన్ని ఆశిస్తున్నాయి. హలీమ్‌కు ఎలాంటి మతపరమైన ప్రాముఖ్యత లేనప్పటికీ, దాని పోషక విలువల కోసం దీనిని కోరుకుంటారు. సాధారణంగా రోజు ఉపవాసం విరమించిన తర్వాత తింటారు. చాలా రెస్టారెంట్లు పవిత్ర మాసంలో నగరంలో హలీమ్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తాయి. అయితే కొన్ని అవుట్‌లెట్‌లు సంవత్సరంలో 365 రోజులు అందుబాటులో ఉంచుతాయి.

హైదరాబాదీ హలీమ్‌కు 'మోస్ట్ పాపులర్ GI' అవార్డు

గత సంవత్సరం.. హైదరాబాదీ హలీమ్ రస్గుల్లా, బికనేరి భుజియా, రత్లామి సెవ్ వంటి ఇతర ఆహార పదార్థాలను అధిగమించి 'మోస్ట్ పాపులర్ జీఐ' అవార్డును హలీమ్‌ గెలుచుకుంది. ప్రజాభిప్రాయం మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ డిష్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ డిష్‌ను ఎంచుకోవడానికి ఆగస్టు 2, అక్టోబర్ 9 మధ్య ఓటింగ్ జరిగింది. పవిత్ర రంజాన్ మాసం వేళ మార్కెట్లలో పండుగ వాతావరణం, రుచికరమైన వంటకం హలీమ్ లభ్యత కోసం హైదరాబాదీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story