హైదరాబాద్ నగరంలో కాల్పుల మోత కలకలాన్ని రేపింది. కూకట్‌పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపిన ఆగంతకులు సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి దొరికినంత డబ్బును దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏటీఎంలో డబ్బులు నింపే సమయంలో కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.సెక్యూరిటీ గార్డు అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీకి పాల్పడిన ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సెక్యూరిటీ గార్డు పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. బ్యాంక్ వద్ద ఉన్న సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు కాల్పులు జరిపిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగంతకులు పాత నేరస్థులేనా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగులు ఆ వెంటనే ఎటిఎం చెస్ట్ లో ఉన్న క్యాష్ ను దోచుకెళ్లారు.. ఆ తర్వాత అక్కడి నుండి దుండగులు పరారయ్యారు.