గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఆధార్ త‌ప్పనిస‌రి

Guidelines for Free water Supply scheme in GHMC.గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఆధార్ త‌ప్పనిస‌రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2021 6:03 AM GMT
GHMC

జీహెచ్ఎంసీ(గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) ఎన్నిక‌ల సమ‌యంలో 20వేల లీట‌ర్ల చొప్పున నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని టీఆర్ఎస్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ హామీని నేర‌వేర్చేందుకు గ్రేట‌ర్ ప‌రిధిలో ఉచితంగా నీరు అందించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. ఈ ప‌థ‌కానికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ ప‌థ‌కానికి ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ పధకం కింద లబ్ది పొందాలనుకునే వారు తమ ఆధార్ కార్డును అనుసంధానం చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఆధార్ లింక్ చేసుకునే గడువును మార్చి నెలాఖరు దాకా పొడిగించింది. బస్తీలలో నల్లాలకు మీటర్లు లేకున్నాడాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేయ‌నున్నారు. అపార్టుమెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించింది స‌ర్కార్.

ఈ ప‌థ‌కం ద్వారా 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచితంగా అంద‌నుండ‌గా.. 20 వేల లీటర్లు దాటిన నీటి వినియోగంపై విధించే పాత ఛార్జీలతో బిల్లు వ‌సూలు చేయ‌నున్నారు. డొమెస్టిక్ యూజర్లు 20వేల ఫ్రీ వాటర్ పొందేందుకు తప్పనిసరిగా మీటర్ ఉండాల్సిందే. దీనికోసం సొంత ఖర్చులతోనే మీట‌ర్ బిగించుకోవాలి. మీటర్ రీడింగ్ ప్రకారం నెలలో 20వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారీఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అపార్టుమెంట్లలోని ప్లాట్ల లెక్కన ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు మంచినీళ్లు అందించనుంచ‌నున్నారు. పది ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్ కు 2లక్షల నీటిని ఉచితంగా సరఫరా చేసి... అంతకు మించిన నీటికి పాత టారీఫ్ లెక్కన బిల్లు వసూల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. స్లమ్ ఏరియాలు, బస్తీల్లో నల్లా కనెక్షన్లకు పూర్తిగా నీటి బిల్లును రద్దు చేశారు.




Next Story