టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్‌

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌ టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు నెట్టింట్ హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనిపై రాజాసింగ్‌ స్పందించారు.

By అంజి  Published on  30 April 2023 9:30 AM IST
MLA Rajasingh, TDP, BJP, Goshamahal

టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్‌

హైదరాబాద్: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌ టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు నెట్టింట్ హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనిపై రాజాసింగ్‌ స్పందించారు. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ తన మాజీ పార్టీ తెలుగుదేశంలో చేరబోనని స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ''నేను టిడిడి నాయకత్వంతో చర్చలు జరపలేదు లేదా వారు (టీడీపీ) నన్ను సంప్రదించలేదు. పార్టీ అవకాశం కల్పిస్తే బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని రాజాసింగ్ అన్నారు.

ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజా సింగ్‌ను బీజేపీ హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌ రద్దుపై బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సస్పెండ్‌ చేసి ఆరు నెలలు దాటినా బీజేపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతోనే రాజాసింగ్‌ పార్టీ మారాలని నిర్ణయించినట్లు తెలుస్తోందని పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి. త్వరలోనే ఆయన తన సొంత గూటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం అంటూ పేర్కొన్నాయి. అయితే దీనిపై రాజాసింగ్‌ స్పందిస్తూ.. తాను టీడీపీలో చేరడం లేదని, తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు.

Next Story