హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అంచెలంచెలుగా విస్తరించిన మెట్రో.. ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో .. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా మళ్లీ పునః ప్రారంభమైంది.

నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా నగరవాసులు ఎక్కువగా మెట్రో రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త వినిపించింది. రేపటి నుంచి మెట్రో ప్రయాణ సమయాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

అయితే వాస్తవానికి ప్రతి రోజు మొదటి మెట్రో రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యేది. ఇక రేపటి నుంచి ఉదయం 6.30 గంటలకు మొదలై రాత్రి 9.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అలాగే ఇప్పటి వరకు మూసివున్న భరత్‌నగర్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌ మెట్రో స్టేషన్లు రేపటి నుంచి తెరుచుకోనున్నాయని ఆయన వెల్లడించారు.

సుభాష్

.

Next Story