హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25 వేల ప్రోత్సాహకం అందించనుంది. ఈ మొత్తాన్ని వారు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే అందించనున్నారు. వారం రోజుల పాటు వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ అధికారుల ద్వారా ఈ మొత్తాన్ని బాధితులకు అందించనున్నారు.
నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకునేవారే ఉన్నారు. ఈ క్రమంలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటున్నా చాలా మందికి బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అక్కడ పనులు దొరకవని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. తమకు 2, 3 కిలోమీటర్ల దూరంలోనే ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో చాలా మందికి జియాగూడ, నార్సింగి, పిల్లిగుడిసెలు ప్రాంతంలోని డబుల్ ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం మంది మాత్రమే ఖాళీ చేశారు.