హైదరాబాద్‌లో గ్యాస్ తిప్పలు..హాస్టళ్లలో టీ, టిఫిన్లకు తాత్కాలికంగా గుడ్ బై

అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై పడింది

By -  Knakam Karthik
Published on : 11 March 2026 5:18 PM IST

Hyderabad News, IT Corridor  Hostels , Global War, LPG Shortage, ITEmployees

హైదరాబాద్‌లో గ్యాస్ తిప్పలు..హాస్టళ్లలో టీ, టిఫిన్లకు తాత్కాలికంగా గుడ్ బై

అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై పడింది. వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడటంతో, హాస్టళ్లలో టీ, కాఫీలతో పాటు చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం మరియు నూనె తీసుకునే టిఫిన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

గ్యాస్ వాడకాన్ని తగ్గించేందుకు అన్నం మరియు ఇతర ప్రాథమిక భోజన పదార్థాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, పరిస్థితిని బట్టి కొన్ని రకాల కూరలను కూడా తగ్గించే అవకాశం ఉందని హాస్టల్ నిర్వాహకులకు మరియు విద్యార్థులకు సమాచారం అందించింది. గ్యాస్ కొరత తీరే వరకు సెల్ఫ్ కుకింగ్ సౌకర్యాన్ని కూడా నిలిపివేస్తూ, ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అనుసరించాలని అసోసియేషన్ కోరింది.

Next Story