పశ్చిమ బెంగాలో అదృశ్యమైన యువతి.. హైదరాబాద్‌లో ఆచూకీ.. ఏడాది తర్వాత

పశ్చిమ బెంగాల్ నుంచి అదృశ్యమైన యువతిని తెలంగాణ మహిళా భద్రతా విభాగం అధికారులు మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో

By అంజి  Published on  17 May 2023 2:00 PM IST
Girl  missing, West Bengal, Hyderabad

పశ్చిమ బెంగాలో అదృశ్యమైన యువతి.. హైదరాబాద్‌లో ఆచూకీ.. ఏడాది తర్వాత

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ నుంచి అదృశ్యమైన యువతిని తెలంగాణ మహిళా భద్రతా విభాగం అధికారులు మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రక్షించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సైబరాబాద్, పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి పని చేసి ఏడాదికి పైగా తప్పిపోయిన యువతిని ట్రాక్ చేయగలిగాయి. "పశ్చిమ బెంగాల్ నివాసి అయిన 20 ఏళ్ల జోహురా ఖాతున్ ఫిబ్రవరి 2022లో ట్యూషన్ కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు" అని ఒక పత్రికా ప్రకటన తెలిపింది. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, తెలిసిన బంధువులు, స్నేహితులు ఇళ్లలో వెతికినా కూడా యువతి జడ తెలియరాలేదు.

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాకు చెందిన మదన్ సాయి కుమారుడు అస్రఫ్ అన్సారీ ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పశ్చిమ బెంగాల్‌లోని హేమతాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న సైబరాబాద్, పశ్చిమ బెంగాల్ పోలీసులు రంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన బాలికను గుర్తించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయి ఉన్నట్టు గుర్తించారు. ఉమెన్స్ సేఫ్టీ అడిషనల్ డీజీ షికా గోయల్ నేతృత్వంలో పోలీసులు.. యువతిని రెస్క్యూ చేసి రక్షించారు. దీంతో వారు ఆమెను పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు.

Next Story