రేపటి నుండి జీహెచ్‌ఎంసీ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడానికి నగరవ్యాప్తంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

By అంజి  Published on  4 Aug 2024 3:00 PM GMT
GHMC, Swachhadanam Pachhadanam, Hyderabad

రేపటి నుండి జీహెచ్‌ఎంసీ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడానికి నగరవ్యాప్తంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఐదు రోజుల పాటూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కొక్కటి నిర్దిష్ట పౌర సమస్య చుట్టూ తిరుగుతాయి.

ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు శాఖల వారీగా సమన్వయంతో పని చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాటా అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. మొదటి రోజు నిర్మాణ వ్యర్థాలను శుభ్రపరచడం జరుగుతుంది. సరైన మార్గాల ద్వారా చెత్తను పారవేయని గృహాలు, సంస్థలను గుర్తించనున్నారు. వీధి వ్యాపారులు, వీక్లీ మార్కెట్లు కూడా ఏరియా వాహనాలతో ట్యాగ్ చేయనున్నారు.

మరుసటి రోజు దోమల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీధి కుక్కలకు టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో అధికారులు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించి నాలాల నుంచి చెత్తను తొలగిస్తారు. ఆగస్టు 9న జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, పార్కులు, చెరువు కట్టలు, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇంటింటికీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

Next Story