హైదరాబాద్‌లోని ఇంటి ఓనర్లకు బిగ్‌ ఆఫర్‌

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్క్‌ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

By అంజి  Published on  16 April 2024 1:20 AM GMT
GHMC, Property tax ,early bird scheme , Hyderabad

హైదరాబాద్‌లోని ఇంటి ఓనర్లకు బిగ్‌ ఆఫర్‌

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్క్‌ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును చెల్లించడానికి ఎర్లీబర్డ్‌ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని తెలిపారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా.. రాయితీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీబర్డ్‌ పథకాన్ని ఆమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.230 కోట్ల ఆదాయం సమకూరిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. నిర్ణీత సమయంలో ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందాలని కమిషనర్‌ పేర్కొన్నారు. కాగా ఈ పథకం ద్వారా రూ.800 కోట్ల పన్నులు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డబ్బుల ద్వారా బల్దియా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భావిస్తోంది.

Next Story