హైదరాబాద్‌లో వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. డిసెంబర్ 20వ తేదీలోగా వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. గడువులోగా రెన్యూవల్ చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ విధించే అవకాశం లేదని తెలిపింది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు 2026 సంవత్సరానికి ట్రేడ్ లైసెన్సులను డిసెంబర్ 20, 2025లోపు రెన్యూవల్ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కోరింది. కాగా నిర్ణయించిన గడువు లోపు రెన్యూవల్ చేసే ఎలాంటి పెనాల్టీ ఉండదని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.
కాగా జీహెచ్‌ఎంసీ ఆమోదించిన రెన్యూవల్ పెనాల్టీ వివరాలు ఇలా ఉన్నాయి: డిసెంబర్ 20, 2025 లోపు పెనాల్టీ లేదు.. డిసెంబర్ 21, 2025 నుంచి ఫిబ్రవరి 19, 2026 వరకు 25% పెనాల్టీ.. ఫిబ్రవరి 20, 2026 తర్వాత 50% పెనాల్టీ..విధించబడుతుందని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.