గ్రేటర్‌ తీర్పు: పూర్తి ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!

GHMC Elections voting counting .. జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లలో

By సుభాష్  Published on  4 Dec 2020 8:32 AM IST
గ్రేటర్‌ తీర్పు: పూర్తి ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!

జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే 18 ఏళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. దీంతో ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది. కాగా, మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్‌లోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల లోపు రెండో రౌండ్‌ పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

మొదట పోస్టల్‌బ్యాలెట్లు, ఆ తర్వాత బ్యాలెట్‌ పత్రాలను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు చేయాల్సి ఉండగా, పలు కారణాలతో కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి పది నిమిషాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తవుతుంది. ఈ సారి 1926 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

రెండు దశల్లో..

రెండు దశల్లో బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లనుప్రాథమికంగా లెక్కిస్తామని, ఆ తర్వాత అభ్యర్థుల వారీగా మరోసారి వివరణాత్మక లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపింది. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లను లెక్కిస్తామని తెలిపింది. ఓట్ల లెక్కింపు కోసం 150 డివిజన్లలో 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రత

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీభద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారు. కౌంటింగ్‌కు కిలోమీటర్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డులను ఏర్పాటు చేశారు.

Next Story