హైదరాబాద్‌లో గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఫలితాల్లో ఎవరికి మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోయినా.. మొదటి స్థానంలో టీఆర్‌ఎస్‌ నిలువగా రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో ఎంఐఎం దక్కించుకున్నాయి.

ఇక మహానగర ఎన్నికల్లో కమలం వికసించడంతో కమలనాథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రేటర్‌ ఎన్నికలపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రశంసించారు. గ్రేటర్‌ చరిత్రలో బీజేపీ అత్యధిక సీట్ల సాధించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు యోగి కృతజ్క్షతలు తెలిపారు.

'హైదారాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం, ప్రధాన మంత్రి మోదీజీ నాయకత్వంపై అపూర్వమైన విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు' అంటూ యోగి ఆదిత్యానాథ్‌ తెలిపారు. సీఎం యోగి ఎన్నికల ప్రచారం తాము హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇక ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుంది.

ఇక ఎన్నికలకు ముందు తామంటే తామంటూ కలర్‌ ఎగిరేసిన ప్రధాన పార్టీలు.. చివరికి వెనుకబడి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చింది బీజేపీ. గతంలో కంటే జోరు ఈ సారి కమలం జోరుగా వికసించింది. కారు స్పీడుకు బ్రేకులు వేసింది బీజేపీ. టీఆర్‌ఎస్‌ పార్టీ అనుకున్న సీట్ల కంటే చాలా వెనుకబడి పోయింది. ఇప్పుడు నాలుగు సీట్ల నుంచి 50 సీట్ల చేరువకు చేరుకున్న బీజేపీ.. ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలిపోతోంది. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపుల్లో టీఆర్‌ఎస్‌కు 55 స్థానాలు, బీజేపీకి 48 స్థానాలు, ఎంఐఎంకు 44 స్థానాలు, కాంగ్రెస్‌కు 2 స్థానాలు వచ్చాయి. వంద సీట్ల వరకు స్థానాలు దక్కించుకుంటామన్న టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.

సుభాష్

.

Next Story