Hyderabad: కుక్కల బెడద నియంత్రణకు ప్రైవేట్‌ డాక్టర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) నగరంలో కుక్కల బెడదను నియంత్రించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్

By అంజి  Published on  27 April 2023 9:00 AM IST
GHMC, dogs, private medical officers, Hyderabad

Hyderabad: కుక్కల బెడద నియంత్రణకు ప్రైవేట్‌ డాక్టర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) నగరంలో కుక్కల బెడదను నియంత్రించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్స్ (ఎబిసి మరియు ఎఆర్‌వి)ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఉన్న 16 మంది పశువైద్యులతో పాటు అదనంగా ఎనిమిది మంది ప్రైవేట్ పశువైద్యులను నియమించాలని కార్పొరేషన్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 'డాగ్‌ క్యాచింగ్‌ స్క్వాడ్‌' పేరు 'జీహెచ్‌ఎంసీ డాగ్‌ బర్త్‌ కంట్రోల్‌ యూనిట్‌'గా మారింది. ప్రస్తుతం ఉన్న 30 వాహనాలకు అదనంగా 20 కుక్కలను పట్టుకునే వాహనాలు జోడించబడతాయి.

జీహెచ్‌ఎంసీ కార్మికులు సాయంత్రం వరకు కుక్కలను పట్టుకునేందుకు తమ కార్యకలాపాలను విస్తరిస్తారు. నగరంలో కుక్కకాటు ఘటనలకు సంబంధించి కరపత్రాల పంపిణీ, మాంసం దుకాణాల యజమానులు, హోటళ్లకు నోటీసులు అందించడం, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA లు), మురికివాడలు, పట్టణ స్థాయి సమాఖ్యలు అలాగే స్వయం సహాయక బృందాలను కలుపుకొని అవగాహన ప్రచారాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు పెరుగుతాయి. ఈ మేరకు మాంసం దుకాణాలు, హోటళ్లు సహా దాదాపు 4001 సంస్థలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసి, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని యాజమాన్యాలను ఆదేశించింది.

1,111 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, మురికివాడలు, పట్టణ స్థాయి సమాఖ్యలతో పాటు 1,066 పాఠశాలల నుండి 2.28 లక్షల మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

Next Story