హైదరాబాద్‌లో మరో గ్లోబల్ సంస్థ పెట్టుబడి, ఐటీ రంగంలో వెయ్యి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయింది.

By -  Knakam Karthik
Published on : 4 Nov 2025 2:35 PM IST

Hyderabad News, Chief Minister Revanth Reddy, German Consul General Michael Hosper,  Deutsche Borse

హైదరాబాద్‌లో మరో గ్లోబల్ సంస్థ పెట్టుబడి, ఐటీ రంగంలో వెయ్యి ఉద్యోగాలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నట్లు జర్మనీ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కాగా GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం తెలిపారు.

హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సీఎంకు జర్మనీ బృందం వివరించింది. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను ముఖ్యమంత్రి కోరారు.

ఇక పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వీటితో TOMCOM ద్వారా పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని సీఎం కోరారు. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story