హైదరాబాద్‌లో మరోసారి పేలుడు సంభవించింది. సోమాజీగూడలోని ఆల్ ఫైన్స్ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఐదో అంతస్తులోని ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన అపార్ట్‌మెంట్ నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అటు మంటల్లో చిక్కుకున్న ఓ పెంపుడు కుక్కను అగ్నిమాపక సిబ్బంది కాపాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.