Hyderabad: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు.
By అంజి Published on 29 Feb 2024 9:34 AM ISTHyderabad: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. మీర్జా వహీద్ వద్ద తరుచుగా కొకైన్ కొనుగోలు చేసినట్లు అబ్బాస్ తెలిపాడు. కొనుగోలు చేసిన కొకైన్ గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్ ను రూ.14 వేలకు కొని గజ్జల వివేక్‌కు విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద కమిషన్ డబ్బులను అబ్బాస్ పొందేవాడు. బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ గత ఏడాది కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు.
ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈ నెల 16,18,19,24న సైతం గజ్జల వివేక్ కు అబ్బాస్ కొకైన్ సప్లై చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను వాట్సాప్ చాటింగ్‌లను, గూగుల్ పే పేమెంట్స్ అధారాలను పోలీసులు సేకరించారు. ఈ డ్రగ్స్ కేసులో గజ్జల వివేక్ స్నేహితులతో సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, స్వేత, లిషి, నేయిల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో మరో ఇద్దరిని నిందితులను చేర్చారు.
A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ ఈ ఇద్దరిని చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తెలిపాడు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన , డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని అబ్బాస్ చెప్పాడు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నాడని అబ్బాస్ చెప్పాడు. డ్రగ్ పార్టీలో శ్వేత, లిషి, నీల్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ , మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసుకుని డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా అబ్బాస్ తెలిపారు.