Hyderabad: ట్రాఫిక్‌ ఆంక్షలు.. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ 5 రాత్రులు మూసివేత

హైదరాబాద్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) పనుల కోసం గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 8 నుండి రాత్రి సమయంలో 5 రోజుల పాటు మూసివేయనున్నారు.

By అంజి  Published on  9 Aug 2024 3:05 AM GMT
Gachibowli flyover, Hyderabad, SRDP

Hyderabad: ట్రాఫిక్‌ ఆంక్షలు.. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ 5 రాత్రులు మూసివేత

హైదరాబాద్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) పనుల కోసం గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 8 నుండి రాత్రి సమయంలో 5 రోజుల పాటు మూసివేయనున్నారు. ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిహెచ్‌ఎంసి చేపట్టనుంది.

ఈ పని ఆగస్ట్ 8 నుండి ఆగస్టు 12, 2024 వరకు 5 రోజుల పాటు రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసివేస్తారు.

ప్రయాణికులు ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.

బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు బిచ్చారెడ్డి స్వీట్స్(టెలీకాం నగర్) నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఐఐఐటి జంక్షన్ వైపు వెళ్లాలి. ఐఐఐటి జంక్షన్ నుంచి బయోడైవర్సీటీ జంక్షన్ బైపాస్ ఫ్లైఓవర్ నుంచి గచ్బిచౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లాలి.

Next Story