రూ.450 నుంచి రూ.27 లక్షల వరకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే

10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది.

By అంజి  Published on  16 Sep 2024 5:30 AM GMT
Hyderabad, Balapur Ganesh, laddu auction

రూ.450 నుంచి రూ.27 లక్షలకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే

హైదరాబాద్: 10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది. గతేడాది ఈ లడ్డూను రూ.27 లక్షలకు వేలం వేయగా దాసరి దయానంద్ రెడ్డి కొనుగోలు చేశారు. బాలాపూర్‌ గణేష్ లడ్డూ వేలం 1994 సంవత్సరం నుండి కొనసాగుతోంది. మొదటిసారి స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు కొనుగోలు చేశారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే కుటుంబం అనేక వేలంపాటల్లో పాల్గొంది. అనేక సందర్భాల్లో విజయవంతంగా గెలుపొందింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. 1994 నుండి 2024 వరకు హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో.. లడ్డూ దక్కించుకున్న వారి జాబితా ఇక్కడ ఉంది.

సంవత్సరంవేలం విజేతరూపాయలు
1994

కొలన్ మోహన్ రెడ్డి

రూ.450

1995

కొలన్ మోహన్ రెడ్డి

రూ.4,500

1996

కొలన్ కృష్ణా రెడ్డి

రూ.18,000

1997

కొలన్ కృష్ణా రెడ్డి

రూ.28,000

1998

కొలన్ మోహన్ రెడ్డి

రూ.51,000

1999

కళ్లెం అంజి రెడ్డి

రూ.65,000

2000

కళ్లెం ప్రతాప్ రెడ్డి

రూ.66,000

2001

జి రఘునందన్ చారి

రూ.85,000

2002

కందాడ మాధవ రెడ్డి

రూ.1,05,000

2003

చిగిరింత బాల రెడ్డి

రూ.1,55,000

2004

కొలన్ మోహన్ రెడ్డి

రూ.2,01,000

2005

ఇబ్రామ్ శేఖర్

రూ.2,08,000

2006

చిగిరింత తిరుపతి రెడ్డి

రూ.3,00,000

2007

జి రఘునందన్ చారి

రూ.4,15,000

2008

కొలన్ మోహన్ రెడ్డి

రూ.5,07,000

2009

సరిత

రూ.5,10,000

2010

కొడాలి శ్రీధర్ బాబు

రూ.5,35,000

2011

కోలన్ బ్రదర్స్

రూ.5,45,000

2012

పన్నాల గోవర్ధన్ రెడ్డి

రూ.7,50,000

2013

తీగల కృష్ణా రెడ్డి

రూ.9,26,000

2014

సింగి రెడ్డి జైహింద్ రెడ్డి

రూ.9,50,000

2015

కళ్లెం మధన్ మోహన్ రెడ్డి

రూ.10,32,000

2016

కందాడి స్కైలాబ్ రెడ్డి

రూ.14,65,000

2017

నాగం తిరుపతి రెడ్డి

రూ.15,60,000

2018

తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్త

రూ.16,60,000

2019

కొలన్ రామ్ రెడ్డి

రూ.17,60,000

2020

అప్పటి సీఎంకు అందజేశారు

రూ.--

2021

రమేష్ యాదవ్ & మర్రి శశాంక్ రెడ్డి

రూ.18,90,000

2022

వంగేటి లక్ష్మా రెడ్డి

రూ.24,60,000

2023

దాసరి దయానంద రెడ్డి

రూ.27,00,000

ట్రాఫిక్ సలహా

ఇదిలా ఉండగా, గణేష్ నిమజ్జన ఊరేగింపుకు సంబంధించిన మార్గాలను హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 17, మంగళవారం నాడు ఊరేగింపుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేలా, ప్రజల భద్రతను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ సలహా మంగళవారం ఉదయం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు అమలులో ఉంటుంది. ప్రధాన ఊరేగింపు, చిన్న చిన్న ఊరేగింపులు, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను వివరించే "రూట్ మ్యాప్"ని అనుసరించాలని పోలీసులు పౌరులను, భక్తులను అభ్యర్థించారు. ప్రజలకు సహాయం చేయడానికి వివిధ ప్రదేశాలలో సమాచార సూచికలు ప్రదర్శించబడతాయి.

Next Story