Hyderabad: గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా

రాబోయే గణేష్, దుర్గా ఉత్సవాల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పండళ్లకు ఉచిత విద్యుత్ సరఫరాను ఆగస్టు 24 ఆదివారం విద్యుత్ శాఖ పొడిగించింది.

By అంజి
Published on : 25 Aug 2025 7:54 AM IST

Free power suppl, Ganesh pandals, Durga Matha pandals, Hyderabad

Hyderabad: గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా

హైదరాబాద్: రాబోయే గణేష్, దుర్గా ఉత్సవాల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పండళ్లకు ఉచిత విద్యుత్ సరఫరాను ఆగస్టు 24 ఆదివారం విద్యుత్ శాఖ పొడిగించింది. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు (11 రోజులు) గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSPDCL) ఒక ప్రకటనలో తెలిపింది.

అదేవిధంగా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు 15 రోజుల పాటు దుర్గా మండపాలకు ఉచిత సరఫరా లభిస్తుంది. టీఎస్‌పీడీసీఎల్‌ పండల్ నిర్వాహకులకు భద్రతా ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అటు నగరంలో గణేష్‌ పండుగ వాతావరణం నెలకొంది. గల్లీల్లో వినాయకులను పెట్టేందుకు నిర్వాహకులు పండళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే గణేష్‌ ఉత్సావాలు ఎంతో సందడిగా ఉండనున్నాయి. అయితే పండళ్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరెంట్‌ వైర్లకు దగ్గరగా పండళ్లను ఏర్పాటు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Next Story