ఫార్ములా - ఈ రేసింగ్‌కు సమయం ఆసన్నం.. నేటి షెడ్యూల్ ఇదే
Formula - The time has come for this racing.. This is today's schedule. రేసింగ్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా
By అంజి Published on 10 Feb 2023 10:24 AM ISTరేసింగ్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా - ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ రేసింగ్‌కు హైదరాబాద్ రెడీ అయ్యింది. నగరం నడిబొడ్డున, హుస్సేన్‌సాగర్ తీరాన ఫార్ములా-ఈ కార్లు టాప్‌గేర్‌లో రయ్య్‌మంటూ దూసుకెళ్లనున్నాయి. ఈ రేసింగ్‌ను రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రేసులో హోరాహోరీగా తలపడేందుకు ఇప్పటికే ప్రముఖ రేసింగ్ కంపెనీలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఫార్ములా - ఈ కార్లు కూడా స్ట్రీట్ సర్క్యూట్‌పై రయ్‌మని పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి.
నేటి నుంచి స్ట్రీట్ సర్క్యూట్ దగ్గర అభిమానుల సందడి మొదలుకానుంది. ఇవాళ మెయిన్ రేస్కు ముందు జరిగే ప్రాక్టీస్ రేస్ జరగనుంది. దీని ద్వారా రేసర్లు ట్రాక్‌పై ఓ అవగాహనకు వస్తారు. రేపు మరో ప్రాక్టీస్ సెషన్ తర్వాత క్వాలిఫైయింగ్, ఆ తర్వాత మెయిన్ రేస్ ఉంటుంది. కార్లను పరుగులు పెట్టించేందుకు రేసర్లు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న రేసు కోసం హుసేన్‌సాగర్ తీర ప్రాంతానికి సరికొత్త హంగులు దిద్దారు. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌పై ఇప్పటికే ఇండియన్ రేసింగ్ లీగ్ జరిగింది. ఇప్పుడు ప్రపంచ స్థాయి రేసింగ్ జరగబోతోంది. నేటి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఉచితంగా చూసేందుకు స్కూల్ విద్యార్థులకు నిర్వాహకులు ఛాన్స్ కల్పిస్తున్నారు.
హైదరాబాద్ వేదికగా.. ఫార్ములా - ఈ రేసు తొమ్మిదో సీజన్ నాలుగో రౌండ్ జరుగనుంది. మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు బరిలో నిలుస్తారు. గత 8 సీజన్లతో అభిమానులను ఎంతగానో అలరించిన ఫార్ములా - ఈ ఫస్ట్‌టైమ్ భారత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సీజన్ ద్వారా జెన్-3 కార్లను రేసింగ్‌లోకి తీసుకొచ్చామని ఫార్ములా - ఈ సీఈవో జామీ రిగిల్ తెలిపారు. సరికొత్త సాంకేతికత, తేలికగా, వేగంగా రూపొందించిన కార్లు స్ట్రీట్ సర్క్యూట్‌లో రయ్‌మంటూ దూసుకెళ్తాయని తెలిపారు.
జెన్-3 కార్లు టెక్నాలజీ పరంగా అత్యుత్తమంగా నిలుస్తాయి. గంటలకు 320 కి.మీ వేగంతో 350 కేడబ్ల్యూ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఫైటర్ జెట్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది వీటిని రూపొందించారు. బ్రేకింగ్ ద్వారా 40 శాతం శక్తిని తిరిగి పొందుతాయి. పొల్యుషన్ లేకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో రూపొందించిన కార్లతో రేసింగ్ రసవత్తరంగా సాగనుంది. రేసింగ్ కోసం ఉపయోగించే మెటీరియల్ మొత్తం రిసైకిల్డ్ వేస్ట్‌తో తయారు చేసినవే. భారత్‌లో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఫార్ములా - ఈ గ్రీన్‌కోతో ఒప్పందం చేసుకుంది.
ఫార్ములా-ఈ నేటి షెడ్యూల్
ఇవాళ మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 వరకు టీమ్ ప్రతినిధులు ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి ఒంటి గంట వరకు డ్రైవర్స్ ప్రెస్‌మీట్ ఉంటుంది. ఆ తర్వాత 1.30 నుంచి 2 గంటల వరకు మీడియా సేఫ్టీ బ్రీఫింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి 2.45 వరకు షేక్‌డౌన్ ఉంటుంది. సాయంత్రం 4.30 నుంచి 5.00 గంటల వరకు ఫ్రీ ప్రాక్టీస్ 1 ఉంటుంది.