'ఆ భూమి నాదే'.. మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్

పేట్ బషీరాబాద్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ హల్చల్ సృష్టించాడు. తాను కొనుగోలు చేసిన భూమిలో మరొకరు చొచ్చుకొని వచ్చారని ఆందోళన చేస్తూ నానా హంగామా చేశాడు.

By అంజి  Published on  18 May 2024 7:07 AM GMT
Former minister mallareddy, land issue, Hyderabad, Pet Basheerabad

'ఆ భూమి నాదే'.. మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ 

హైదరాబాద్‌: పేట్ బషీరాబాద్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ హల్చల్ సృష్టించాడు. తాను కొనుగోలు చేసిన భూమిలో మరొకరు చొచ్చుకొని వచ్చారని ఆందోళన చేస్తూ నానా హంగామా చేశాడు. అంతేకాకుండా మాజీ మంత్రి మల్లన్న అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో ఉన్న భూమి విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం కొనసాగుతున్నది. రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వివాదాస్పద స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో మరో 15 మంది మధ్య వాగ్వాదం చెలరేగింది.

ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తు న్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది అంటున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది పోలీసులకు చెప్తున్నారు.

దీంతో ఆ స్థలంలో ఉన్న మల్లన్న.. ఆ భూమి తనదే అంటూ నానా రచ్చ రచ్చ సృష్టించాడు. తన జాగలోకి వచ్చి కబ్జా చేశారు అంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా' అని అన్నారు. ఆ 15 మంది పెట్టిన రేకుల వాల్ తొలగించేందుకు తన అనుచరులను పురిగొల్పాడు. రాత్రికి రాత్రి వచ్చి తన స్థలంలో కబ్జాకి పాల్పడ్డారని మల్లారెడ్డి ఆరోపించారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా వినకుండా మల్లారెడ్డి, అతని అల్లుడు, అనుచరులు అక్కడ నానా హంగామా సృష్టించారు. వివాదాస్పద స్థలంలో ఉన్న పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చజెప్పి సమస్య సద్దుమణిగేటట్లు చేసేందుకు ప్రయత్నం చేశారు.

Next Story