హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH vs RCB ఐపీఎల్ మ్యాచ్ కోసం మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రకటించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న మ్యాచ్ కోసం.. చివరి రైలు 12:15 గంటలకు సంబంధిత టెర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరి వారి గమ్యస్థానాలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
“హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం మాత్రమే ఉప్పల్, స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ మెట్రో స్టేషన్‌లలో షెడ్యూల్ అవర్స్‌కి మించి ప్రవేశానికి అనుమతి ఉంది. ఇతర స్టేషన్లలో కేవలం ఎగ్జిట్ మాత్రమే అందుబాటులో ఉంటాయి” అని హైదరాబాద్ మెట్రో రైలు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. SRH ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. SRH మొదటి నాలుగు స్థానాల్లో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి RCB తో మ్యాచ్ చాలా కీలకం.