అఫ్జ‌‌ల్‌గంజ్‌లోని టైర్ల‌గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. ప‌క్క‌నే పెట్రోల్ బంక్.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

Fire broke out in Afzalganj.హైదరాబాద్ న‌గ‌రంలోని అప్జ‌ల్‌గంజ్‌లోభారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 7:48 AM GMT
fire accident in afzalgunz

హైదరాబాద్ న‌గ‌రంలోని అప్జ‌ల్‌గంజ్‌లోభారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ టైర్ల గోదాములో మంట‌లు అంటుకున్నాయి. చాదర్‌ఘాట్ నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే రోడ్డులో ఉన్న ఈ టైర్ల గోదాంలో భారీగా మంటలు ఎగిసిప‌డుతున్నాయి. ఈ గోదాం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో టైర్లకు మంటలంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు.

వెంట‌నే ప‌క్క‌నే ఉన్న పెట్రోల్ బంకును పోలీసులు మూసివేయించారు. మరోవైపు ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో రాకపోకల్ని సైతం పోలీసులు నిలిపివేశారు. అక్క‌డ‌కు చేరుకున్న 15 ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మంట‌ల తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో అగ్నిమాప‌క సిబ్బంది లోప‌లికి వెళ్ల‌లేక‌పోతున్నారు. అగ్నిప్రమాదంతో చాదర్‌ఘాట్-అఫ్జల్‌గంజ్ దారిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆ రూట్‌లో వెళ్లేవాళ్లు మరో రోడ్‌లో వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. మంట‌ల‌ను ఆర్పేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Next Story
Share it