జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న సిబ్బంది..!

Fire Accident in Secunderabad GHMC Zonal Office.సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 10:24 AM GMT
జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న సిబ్బంది..!

సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ(గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) కార్యాల‌యంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నాం అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాల‌యంలోని మూడో అంత‌స్తులోని టాక్స్ సెక్ష‌న్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. భారీగా మంట‌లు చెల‌రేగ‌డంతో ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది. ఏమైందో తెలియ‌క ఉద్యోగులు భ‌యాందోళ‌న‌కు గురై వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది మూడు ఫైరింజన్ల‌తో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నిస్తున్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. దీంతో లిప్ట్‌లో కొంత మంది ఉద్యోగులు ఇరుక్కుపోయారు. ఐదో అంత‌స్తులో ఉన్న సిబ్బందిని సైతం కింద‌కు తీసుకువ‌చ్చేందుకు య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ప‌లు ఫైళ్లు కాలిపోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

Next Story