పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Fire Accident in Pedda Amberpet.హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on
17 Sep 2021 5:20 AM GMT

హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో రసాయనాలు నిల్వ ఉండడంతో క్షణాల్లో మంటలు అంతటా వ్యాప్తించాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండగా.. చుట్టు పక్కల ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అప్పుడప్పుడు భారీ శబ్దాలు వినిపిస్తుండగా.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 5 పైరింజన్లతో అక్కడకు చేరుకున్నారు. మంటల ధాటికి గోదాములోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో అధికారులు జేసీబీల సాయంతో గోడలను కూల్చివేశారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story