యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హిస్తున్న‌ గో మహాగర్జన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. గో మహాగర్జన సభ వేదికపై అగ్నిప్రమాదం సంభవించింది. సభా వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్ స‌ర్క్యూట్ తో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్ర‌మాదంలో మూడు గుడారాలు కాలిపోయాయి. వేదిక వ‌ద్ద‌కు పోలీసులు, యుగ‌తుల‌సి స‌భ్యులు, వాలంటీర్లు చేరుకుని స‌కాలంలో మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కాసేప‌ట్లో స‌భ ప్రారంభం కానుండ‌గా.. ఈ అగ్నిప్రమాదం జ‌ర‌గ‌డంతో నిర్వ‌హ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story