కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. 3 బస్సులు ద‌గ్థం

Fire accident in Kukatpally 3 buses burnt.కూక‌ట్‌ప‌ల్లిలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2023 8:44 AM IST
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. 3 బస్సులు ద‌గ్థం

ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు న‌గ‌ర వాసుల‌ను భ‌యబ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ ద‌క్క‌న్ మాల్‌, చిక్క‌డ‌ప‌ల్లి గోదాం, నూత‌న స‌చివాల‌యం, రామాంత‌పూర్ ఘ‌ట‌న‌లు మ‌రువ‌క ముందే కూక‌ట్‌ప‌ల్లిలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. పార్క‌ట్ షెడ్స్‌లో పార్కింగ్ చేసిన మూడు బ‌స్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి.

తొలుత ఓ బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ఆ మంట‌లు ప‌క్క‌నే ఉన్న మ‌రో రెండు బ‌స్సుల‌కు అంటుకున్నాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే.. అప్ప‌టికే మూడు బ‌స్సులు ద‌గ్థం అయ్యాయి. ఆ స‌మ‌యంలో బ‌స్సులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

అయితే.. బ‌స్సులో మంట‌లు ఎలా చెల‌రేగాయి అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ప్ర‌మాదం స‌మాచారం అందుకున్న కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాద‌వ‌శాత్తు మంట‌లు అంటుకున్నాయా..? లేక ఎవ‌రైనా కావాల‌నే బ‌స్సుకు నిప్పు పెట్టారా..? అన్న కోణంలో విచార‌ణ చేస్తున్నారు.

Next Story