హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా గుట్టు రట్టు

హైదరాబాద్‌ నగరంలో విస్కీ ఐస్‌క్రీముల దందా బయటపడింది. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్‌ స్టోర్‌ యజమానులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను ఎక్సైజ్‌ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  6 Sep 2024 6:30 AM GMT
Excise enforcement, whiskey ice creams, Hyderabad

హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా గుట్టు రట్టు 

హైదరాబాద్‌ నగరంలో విస్కీ ఐస్‌క్రీముల దందా బయటపడింది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే తినే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు. విస్కీతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్‌ స్టోర్‌ యజమానులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను ఎక్సైజ్‌ శాఖ అధికారులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఐస్ క్రీమ్ పార్లర్ షాపుల్లో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు.

ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్‌లో యాడ్‌ ఇచ్చి మరీ అమ్ముతున్నారు. తాజాగా ఈ వ్యవహారం బయటపడింది. ఐస్‌క్రీమ్‌ తయారీదారులు 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్‌ విస్కీ కలుపుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. దుకాణంలో సుమారు 11.50 కిలోల విస్కీ ఐస్‌క్రీమ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం-1లోని స్టోర్‌లో ఐస్‌క్రీం తినేందుకు యువత, చిన్నారులు ఎగబడుతున్నారు. ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. న‌గ‌రంలో ఇలాంటి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్లు ఎన్ని ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విక్ర‌యాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story