హైదరాబాద్ నగర శివార్లలోని గాజులరామారం ప్రాంతంలో మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేడు ఉదయం 10:10 గంటల ప్రాంతంలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్, మెట్కాన్‌గూడ పరిసరాల్లో ఈ ప్రభావం కనిపించింది.
భూమి కంపించే సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, ఇంట్లోని సామాగ్రి, కిటికీలు కదిలిపోయాయని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం భయబ్రాంతులతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గూమి గూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాలు వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు.