బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Drugs seized in Banjara Hills.హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో పెద్ద మొత్తంలో మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. తెలంగాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2021 8:47 AM GMT
బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో పెద్ద మొత్తంలో మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బంజారాహిల్స్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుకున్నారు. అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 30 గ్రాముల ఎండీఎంఏ, 10 కేజీల గంజాయి, 50 గ్రాముల ఛారాస్‌, నాలుగు బోల్ట్స్ ఎల్ఎస్‌డీ డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను హైదరాబాద్‌కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్‌కు చెందిన శిల్పానుగా గుర్తించారు. వారినుంచి రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it