హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..పగిలిన పైప్‌లైన్, ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్
నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది.
By - Knakam Karthik |
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..పగిలిన పైప్‌లైన్, ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్
హైదరాబాద్: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కి ఏర్పడిన లీకేజీను ఆరికట్టడానికి పైపులైనుకు అత్యవసరంగా మరమ్మత్తులు చేపట్టాల్సి వుంది. కావున, తేది. 02.01.2026 శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.03.01.2026 శనివారం ఉదయం 6 గంటల వరకు 19 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 19 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్ర పాలిటన్ వాటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
అంతరాయం ఏర్పడే డివిజన్ల పరిధిలోని ప్రాంతాలు:
1. ఓ అండ్ ఏం డివిజన్–VI: ఎస్.ఆర్. నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగల్‌రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు.
2. ఓ అండ్ ఏం డివిజన్–IX: కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భారత్నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హస్మత్‌పేట్ సెక్షన్.
3. ఓ అండ్ ఏం డివిజన్డి–XII: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్‌నగర్, భగత్‌సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్.
4. ఓ అండ్ ఏం డివిజన్ –XIII: అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పాయినగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్.
5. ఓ అండ్ ఏం డివిజన్ –XIV(కాప్రా మున్సిపాలిటీ): చర్లపల్లి, సాయిబాబానగర్, రాధిక సెక్షన్లు.
6. ఓ అండ్ ఏం డివిజన్–XV: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్‌లో భాగం.
7. ఓ అండ్ ఏం డివిజన్–XVII: హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు.
8. ఓ అండ్ ఏం డివిజన్ –XXI: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నగరం సెక్షన్.
9. ఓ అండ్ ఏం డివిజన్ –XXI : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం సెక్షన్లు.
10. ట్రాన్స్‌మిషన్ డివిజన్–IV: ఎంఈఎస్, త్రిశూల్ లైన్లు, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, ఏఐఐఎంఎస్–బిబినగర్.
11. ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫ్‌టేక్స్: ఆలేరు (భువనగిరి), ఘనపూర్ (మెద్చల్/షామీర్‌పేట్) ప్రాంతాలు.
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం================= =హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కి ఏర్పడిన లీకేజీను… pic.twitter.com/3HxE3yzQCG
— HMWSSB (@HMWSSBOnline) January 2, 2026